కోల్ బెల్ట్ లో గణేషుడి నిమజ్జన శోభాయాత్ర
23-09-2026 | 08:41pm
నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని కోల్ బెల్ట్(coal belt) ప్రాంతంలో బుధ వారం గణనాథుల నిమజ్జన శోభయాత్ర(Vinayaka immersion ceremonies) అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంటపాలలో కొలువై ఉన్న వినాయకుడికి అత్యంత భక్తిశ్రద్ధలతో చివరి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారికి తీర్థప్రసాదాలు సమర్పించిన అనంతరం ఆయా కాలనీలు, వార్డులలోని కుటుంబాలకు పులిహోరా, సిరా నైవేద్యాలను పంచిపెట్టారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళహారతుల నడుమ స్వామివారి విగ్రహాన్ని కదిలించి నిమజ్జనానికి మహిళల కోలాటాలు, చిన్నారుల నృత్యాల మధ్య తరలించారు. వర్షంలోనూ శోభయాత్రను కొనసాగించారు.