MKSTY రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శిగా వోoటెల శరత్ కుమార్
27-09-2026 | 08:02pm
కొత్తపల్లి, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): మున్నూరు కాపు సంఘం తెలంగాణ యువజన రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శిగా వోoటెల శరత్ కుమార్(Vontela Sarat Kumar) ను నియమించడం జరిగింది. నియామకపు పత్రాన్ని(Letter of appointment) అందజేస్తున్న మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరి శంకర్(Challa Hari Shankar) అందజేసారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసాల హరీష్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, రాష్ట్ర యువజన కార్యదర్శి నేతి కుంట అజయ్ కుమార్, నాయకులు కర్ర సూరి,మున్నూరు కాపు కుల బంధావులు పాల్గొన్నారు.