29 August, 2026 | 6:17 PM

కారు–ఎక్సెల్ ఢీ.. వీఆర్ఏకు గాయాలు

29-08-2026 05:43 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని వైన్స్ ప్రాంతంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షిఫ్ట్ డిజైర్ కారు (TS 23 E 5789) ఎక్సెల్ మోటార్ సైకిల్‌ను ఢీకొనడంతో మామిడిపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ చెన్నయ్య గాయపడ్డారు.మామిడిపల్లి గ్రామం నుంచి కోనరావుపేట తహసీల్దార్ కార్యాలయానికి ఎక్సెల్ మోటార్ సైకిల్‌పై వస్తున్న చెన్నయ్యను వైన్స్ ప్రాంతంలో షిఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన చెన్నయ్యకు ప్రాథమిక చికిత్స అందించారు.అనంతరం మెరుగైన చికిత్స కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.