వ్యాస పూజ, నందోత్సవ వేడుకలు
హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో నిర్వహణ
హైదరాబాద్, సెప్టెంబర్ 5(విజయక్రాంతి): అంతర్జాతీయ హరేకృష్ణ ఉద్యమ(ఇస్కాన్)(International Hare Krishna Movement) వ్యవస్థాపకాచార్యులు, విశ్వగురు శ్రీల ప్రభుపాదుల దివ్య ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో నందోత్సవం, 130వ వ్యాస పూజ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ సంద్భంగా హరే కృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ ‘వ్యాస పూజ ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీల ప్రభుపాద సందేశ విశిష్టతను, ఆధునిక కాలంలో శ్రీకృష్ణుని లీలలను స్మరించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. శ్రీల ప్రభుపాదులవారి జీవితం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ఏవిధంగా ప్రేరణగా నిలుస్తుందో ఆయన వివరించారు.






