సైబర్ భద్రతపై గోడపత్రికలు ఏర్పాటు: సిర్గాపూర్ ఎస్ఐ జి.మహేష్
16-09-2026 | 10:22pm
సిర్గాపూర్ సెప్టెంబర్ 16(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ ఎస్ఐ జి. మహేష్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గోడపత్రికలను ఏర్పాటు చేశారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిర్గాపూర్ పోలీసులు సూచించారు.
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు. బలమైన పాస్వర్డ్ లతో పాటు 2FA(టూ - ఫ్యాక్టర్ అథెంటికేషన్)వినియోగించాలన్నారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 (లేదా) సంబంధిత అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ గోడపత్రికలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.