కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి

27-09-2026 | 07:41pm

- కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు

- ప్రజా హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం

మణుగూరు, సెప్టెంబర్ 27, (విజయక్రాంతి ): కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) జయంతి వేడుకలను మణుగూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్(Pirinaki Naveen) ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రజల హక్కులు, సామాజిక న్యాయం(Social Justice), అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాపూజీ జీవితాంతం పోరాడారని నాయకులు కొనియాడారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నార. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఐక్యంగా పనిచేయాలని అన్నారు.

కార్యక్రమంలో సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, యువజన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మరిన్ని వార్తలు