అమరుల త్యాగాలను స్మరించుకోవాలి

13-09-2026 | 05:05am
  1. అది ప్రతి ఒక్కరి బాధ్యత 
  2. ఎంపీ డీకే అరుణ 
  3. అప్పంపల్లిలో అమరవీరులకు నివాళి

మహబూబ్‌నగర్/కౌకుంట్ల, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవ(Telangana Liberation Day) వారోత్సవాల్లో భాగంగా కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో బీజేపీ ఆ ధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహబూబ్‌నగర్(Mahabubnagar) ఎంపీ డీకే అరుణ(DK Aruna) శనివారం అమరవీరుల స్థూపానికి(Martyrs Stupa) నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లా డుతూ.. అమరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె అన్నా రు.

1947 అక్టోబర్ 7న బెల్లం నాగన్న నా యకత్వంలో అప్పంపల్లి గ్రామ ప్రజలు రజాకార్ల అరాచకాలకు ఎదురు తిరిగి పోరాడా రని, ఈ పోరాటంలో 11 మంది అమరులయ్యారని, పలువురు గాయపడ్డారని గుర్తుచే శారు. నిజాం రజాకార్ల(Nizam Razakars) నిరంకుశత్వానికి అ ప్పటి రావి చెట్టు సజీవ సాక్ష్యంగా నిలిచిందన్నారు. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందినా తెలంగాణకు మాత్రం వెంటనే స్వాతంత్య్రం రాలేదన్నారు. రజాకార్ల అరాచకాలను గుర్తించిన అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు పోలీసు చర్య చేపట్టారని తెలిపారు.

సెప్టెంబర్ 17న నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బీఆర్‌ఎస్ గతంలో అనేక హామీలు ఇచ్చినా విమో చన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక వర్గం మెప్పు కోసం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్స రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోందని, ఈ ఏడా ది రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొననున్నారని తెలిపారు.

అప్పంపల్లి అమరవీ రుల త్యాగం, చరిత్ర ఎప్పటికీ చెదిరిపోదని, అమరుల రక్తంతో తడిసిన అప్పంపల్లి నేల పవిత్రమైనదని డీకే అరుణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రతంగ్ పాండు రెడ్డి, పగడాకుల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రె డ్డి, పవన్ కుమార్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, బల రాం రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, కా ర్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, యజ్ఞ భూపాల్, రఘురామయ్య, తిరుపతి రెడ్డి, లక్ష్మీ శ్యామ్ సుందర్, రమేష్, కేశవ రెడ్డి, సర్పంచ్ మనోహర్ రెడ్డి, కృష్ణవర్ధన్ రెడ్డి, వీరబ్రాహ్మచారి, చెన్నారెడ్డి, రాజు, కర్నె స్వామి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు