మాదిగ జాతిని బలోపేతం చేస్తాం...

21-09-2026 | 06:40pm

తాడువాయిలో మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్ రాములు 

తాడ్వాయి,సెప్టెంబర్,21( విజయ క్రాంతి ): రాష్ట్రంలో మాదిగ జాతిని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బట్టు వెంకట్ రాములు(MRPS State Executive Committee member Venkat Ramulu) తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన సోమవారం మాట్లాడుతూ... రాష్ట్రంలో మాదిగ జాతికి సరైన న్యాయం జరగడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మాదిగ జాతి బిడ్డలు ఆర్థికంగా,సామాజికంగా వెనుకబడి పోతున్నారన్నారు. అందుకోసం తమ వంతు పోరాటం చేస్తామని తెలిపారు.జాతి బలోపేతం కోసం ఈ నెల 22న తాడ్వాయిలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లెగ్గిల రాజు, దళిత సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి ప్రవీణ్, నాయకులు బాల సాయిలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు