మధ్యాహ్న భోజన కార్మికుల హామీలు అమలు చేయాలి

21-09-2026 | 08:04pm
  1. ఎంఈఓ, ఎంపీడీవోలకు వినతి
  2. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి 

కోనరావుపేట సెప్టెంబర్ 21 (విజయక్రాంతి):మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం(Government) ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కొనరావుపేట మండల ఎంఈఓ, ఎంపీడీఓ లకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ..

ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను  పరిష్కరించాలన్నారు. నిత్యావసర సరుకుల ధరలు అధికంగా పెరిగిన తరుణంలో కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని, గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే అందించాలన్నారు.

పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచకపోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు  ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థులకు అందించే అల్పాహారాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా మధ్యాహ్న భోజన కార్మికుల చేతనే చేయించాలి. వీరి ప్రధాన డిమాండ్లు

ప్రభుత్వం ప్రకటించిన విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు రూ. 10 వేలు వేతనం వెంటనే అమలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. తదితర సమస్యలను పరిష్కరించాలి. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని బంద్ చేసి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ఎల్లారెడ్డి తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బాలమణి, పి. వసంత, వెంకటలక్ష్మి, ఆర్. లక్ష్మి, నర్సవ్వ, సత్తవ్వ, రాద తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు