సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
కాంగ్రెస్ పాలన అందిస్తున్న సంక్షేమ పథకాల
బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్టలో టీపీసీసీ ఓబీసీ నియోజకవర్గ సమావేశం
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం(Congress People's Governance Government) ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Beerla Ailaiah) అన్నారు. ఆదివారం టీపీసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ(Aleru Assembly Constituency) సమావేశాన్ని యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీర్ల అయిలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, నియోజకవర్గంలోని ప్రతి మండలం, గ్రామం, బూత్ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో టీపీసీసీ ఓబీసీ విభాగం రాష్ట్ర నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు, ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల ఓబీసీ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.