ప్రక్షాళన జరిగేనా..!

19-09-2026 | 05:30am
  1. ప్రైవేటుకు మొగ్గు చూపుతున్న ప్రభుత్వ  వైద్యులు..?
  2. సర్కారు  దవఖానాలో సమస్యల తిష్ట..
  3. పనిచేయని లిఫ్టు... ఇబ్బందుల్లో హుద్రోగులు
  4. నిత్యం 1200 పైన ఓపీ  వైద్య సేవల్లో రోగులు
  5. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు జరిగిన మారని తీరు
  6. ఆగమ్య గోచరంగా జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వైద్య సేవల తీరు
  7. సర్కారీ కొలువుల్లో  కొలువుదీరుతూ.. ప్రైవేటు వైద్యశాలకు  మొగ్గు చూపుతున్న కొంతమంది ప్రభుత్వ వైద్యులు.?
  8. ఇద్దరు మంత్రులు ఒక డిప్యూటీ సీఎం ఉన్న ఇలాఖాలోనే ఈ తతంగం..?

ఖమ్మం హెల్త్, సెప్టెంబర్ 18  (విజయక్రాంతి) : ఖమ్మం జిల్లా ప్రభుత్వ దవాఖానా(Khammam District Government Hospital)లో ప్రక్షాళన  జరిగేనా....? అంటూ ప్రజలు  చర్చించుకుంటున్నారు.. సర్కారు సేవల్లో కొలువుదీరిన కొంతమంది ప్రభుత్వ వైద్యులు(Government doctors) ప్రైవేటు వైద్యశాల(Private hospital) వ్యాపారాలకి ఎక్కువ మొగ్గుచూపుతు సర్కారు దవఖానా లో తక్కువ సమయాన్ని వెచ్చించి కాస్త పేషెంట్లు తగ్గుముఖం పట్టిందని అనిపిస్తే సందర్భం కనిపిస్తే వెంటనే పలాయనం చిత్తగిస్తున్నారు కొంతమంది ప్రభుత్వ వైద్యులు..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులకు ప్రైవేటు వైద్యశాలలు నిర్వహణ ఉండకూడదని జీవోలు చెబుతున్నప్పటికీ అత్యున్నత పెద్ద పోస్టులో ఉంటూ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులుగా.. మరి కొంతమంది ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న జాబితా ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రస్తుతం గా కనిపిస్తున్నప్పటికీ... ప్రజా పాలన ప్రభుత్వం వారికి అండగా ఉందని సాకు.. సాకుగా కాకుండా ప్రస్ఫుటంగా వారి మాటల్లోనే ఆ నోట ఈ నోట వినిపిస్తుందని ఆరోపణలు  వెల్లువెత్తుతున్నాయి..

ఖమ్మం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఒక డిప్యూటీ సీఎం ఉన్న  ఇలాకాలోనే ఇంతటి నిర్లక్ష్య ధోరణి, ప్రైవేటు వైద్యశాలల దోపిడి తీవ్రంగా జరుగుతుందని వాస్తవాలు వాస్తవ రూపంలో దాపురించినప్పటికీ వాటిని కప్పిపుచ్చుకుంటూ కొంతమంది వైద్యులు ఒక వైద్యాధికారి తమ వైద్యశాలను మూడు మూడు ఇన్ పేషెంట్ ఆరు సర్జరీ ల వలె  వారి వ్యాపారాలను చక్కదిద్దుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.. 

సర్కారు  దవఖానాలో సమస్యల తిష్ట..

గత నాలుగేళ్లుగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్కారు దావకానాలు కార్డియాలజీ, యూరాలజీ విభాగానికి వెళ్లేందుకు ట్రామా  కేర్ సెంటర్ నూతన భవనానికి రోగులు రోగి సహాయకులు వెళ్లేందుకు లిఫ్టును ఏర్పాటు చేశారు. కానీ ఆ లిఫ్టు అలంకారప్రాయంగానే మిగిలిపోయిందని రెండు అంతస్తులు వెళ్లేందుకు మెట్లు... ర్యాంపు మార్గాన వెళ్లాలంటే అవస్థలు పడుతున్నామని రోగులు రోగి నాయకులు వాపోతున్నారు.. ఆయాసం రావద్దని గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టేందుకే తాత్కాలికమైన అంశంలో భాగంగా లిఫ్ట్ ఏర్పాటు చేస్తే ఆ లిఫ్ట్ కాస్త మూన్నాళ్ళ ముచ్చటగానే మారిందని  రోగులు రోగి సహాయకులు ఆరోపిస్తున్నారు..

భోజనం పైకి అందించాలన్న కష్టతరమే...!

ప్రజా పాలన ప్రభుత్వంలో రోగులకు భోజనం పాలు బ్లడ్ అందించాలంటే డైట్ విభాగాన్ని చెందిన కార్మికులు వారి స్ట్రక్చర్ వాహనం ద్వారా నెట్టుకుంటూ పైకి వెళ్లాలంటే చెందాల్సిందే. అదే లిఫ్టు అందుబాటులో ఉన్నట్లయితే రోగులకు అందాల్సిన భోజనం పాలు బ్రెడ్ సరైన సమయంలో వారికి అందే అవకాశం ఉంది.. ఒకే ఒక్క లిఫ్టు పనిచేయని కారణంగా అనేక అనర్ధాలు అవస్థలు ఏర్పడుతున్న నేపథ్యంలో పలుమార్లు రోగులు సహాయకులు వినరుల రూపంలో ఫిర్యాదు చేసినప్పటికీ ప్రతిఫలం శూన్యంగా మారిందని ఖమ్మం జిల్లా ప్రజానికం విమర్శిస్తుంది...

నిత్యం 1200 పైన ఓపీ  వైద్య సేవల్లో రోగులు..

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిత్యం 1000 నుంచి  2000 పైచిలుకు  ఓబి సేవలు అందుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. కాగా..  రోగుల రద్దీ పెరిగినప్పటికీ వైద్య సేవలు అందించడంలో వైద్యులు కొన్ని సందర్భాలలో అందుబాటులో ఉండకపోవడం కొంతమంది వైద్యులు సెలవులు పెట్టడం కంటి విభాగంలో శాస్త్ర చికిత్స చేయించుకున్న వారికి శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి కంటి అద్దాలు,  కంటి చుక్కల మందును బయట మెడికల్ షాప్ లో కొనుగోలు చేసుకోవాలని సూచించడం కొసమెరుపుగా మారింది..

జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు జరిగిన మారని సర్కారు తీరు..

గత నాలుగేళ్లుగా అనేకమంది జిల్లా కలెక్టర్లు మారినప్పటికీ ముజమ్మిల్ ఖాన్ వద్ద నుంచి మొదలుకుని  ప్రస్తుత కలెక్టర్ దివాకర్ టి.ఎస్. జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు చేసినప్పటికీ అభివృద్ధి కానీ,  వైద్యుల పనితీరు కానీ ఏమి మారలేదని రోగులు ప్రజలు ఆరోపిస్తున్నారు..

మరిన్ని వార్తలు