వినియోగదారుని జేబుకు చిల్లు పడేనా?
- అక్టోబర్ 15 నుంచి డిజిటల్ చెల్లింపులపై వడ్డింపు
- యూపీఐ చెల్లింపులపై రుసుముల ప్రచారం.. డిజిటల్ లావాదేవీలపై ఆందోళనలు
- యూపీఐ యూజర్లకు షాక్.. సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత?
- కథ మళ్లీ మొదటికి వచ్చిందని స్థానికుల నిట్టూర్పు
రంగారెడ్డి, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): ధరాఘాతంతో కుదేలవుతున్న సామాన్యుడిపై యూపీఐ చార్జీల(UPI charges) రూపంలో పరోక్ష భారం ఇక నుంచి పడనుంది. ఇప్పటికే ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు(Prices of essential commodities), పెట్రోల్- డీజిల్(Petrol-Diesel), గ్యాస్ భారాన్ని మోస్తున్న సామాన్యుడికి కేంద్ర ప్రభుత్వం(Central Government) మరొక షాక్ ఇచ్చేందు కు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్న డిజిటల్ చెల్లింపుల(Digital payments)పై మర్చంట్ డిస్కౌంట్ రేట్(Merchant Discount Rate) (ఎండిఆర్ ) రూపంలో చార్జీలు విధించేందుకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 15 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త నిబంధనలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ మరింత అస్తవ్యస్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యూపీఐ చార్జీల విధింపు పర్సన్ టు పర్సన్‌ఉచితం....
వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే లావాదేవీలకు (ఉదాహరణకు స్నేహితులకు లేదా బంధువులకు పంపే డబ్బులకు) ఎలాంటి చార్జీలు ఉండవు.మర్చంట్ (పీ టూ ఎం) లావాదేవీలపై రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొ న్ని వ్యాపార లావాదేవీలపై 0.4% ఎం డి ఆర్ వర్తిస్తుంది.నిర్దిష్ట సేవలకు స్థిర చార్జీ వర్తిస్తుంది. అందులో విద్యుత్, నీరు, గ్యాస్, స్కూల్, కాలేజీ ఫీజులు, పెట్రోల్, బీమా ప్రీ మియం వంటి చెల్లింపులకు రూ.2,000 దా టితే రూ.5 స్థిర ఎం డి ఆర్ విధించనున్నారు.
రూ.75,000 దాటిన పెద్ద మొత్తాల వ్యాపా ర లావాదేవీలపై చార్జీలు గరిష్టంగా రూ .300 వరకు పరిమితం చేశారు.వ్యాపారులు మరియు కస్టమర్లపై ప్రత్యక్షంగా ప్రభావం పడే అవకాశం ఉంది.షాపింగ్, హోటళ్లు మి నిమం రూ.5,000 వరకు లావాదేవీలు చేస్తేవినియోగదారుడు 0.4% (రూ.20) అద నంగా చెల్లించాల్సి నా అవసరం ఉంది.పెద్ద మొత్తంలో కొనుగోలు (రూ.50,000 ఫోన్) 0.4% (రూ.200)కస్టమర్ నేరుగా కట్టకపోయినా పరోక్షంగా ధరలో సర్దుబాటు కానుం ది. నిత్య జీవిత బిల్లులు (గ్యాస్/కరెంట్/ఫీజులు)రూ.5 స్థిర చార్జీసేవలను అందించే సం స్థలు ఈ చార్జీలను బిల్లులోనే కలిపే ప్రమా దం ఉంది.
ఇంటి బడ్జెట్ లెక్కలు తలకిందులు
నెలకు రూ.20,000 ఆదాయం ఉన్న ఒక సాధారణ కుటుంబం అద్దె, విద్యుత్, చదువులు, నిత్యావసరాల ఖర్చులకే రూ.18,100 వరకు వెచ్చిస్తోంది. మిగిలే రూ.1,900 పొదుపుపై చిన్నపాటి ధరల పెంపు కూడా తీవ్ర ప్రభావం చూపుతుం ది.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఎం డి ఆర్ చార్జీని వినియోగదారుల నుంచి నేరు గా వసూలు చేయకూడదని పేర్కొన్నప్పటికీ, వ్యాపారులు తమకు పడే 0.4% భారాన్ని వస్తువుల ధరలు పెంచడం ద్వారా కస్టమర్ల పైనే మోపే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కథ మళ్లీ మొదటికి....
గత ఆరేళ్లుగా చిరు వ్యాపారుల నుంచి సూపర్ మార్కెట్ల వరకు యూపీఐ విధానం విస్తరించింది. అయితే, ప్రస్తుత నిర్ణయంతో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జి ల్లాల్లో యూపీఐ వాడకం పెరిగాక ఇప్పటికే సగానికి పైగా ఏటీఎంలు మూతపడ్డాయి. ఉన్న వాటిలోనూ నగదు లభ్యత తక్కువగా ఉంది. డిజిటల్ చార్జీల భయంతో ప్రజలు మళ్లీ నగదు చెల్లింపుల వైపు మొగ్గు చూపితే, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి విఘా తం కలుగుతుంది.
లాభాల శాతం తగ్గుతుండటంతో స్కానర్ల ద్వారా చెల్లింపులు స్వీకరించడానికి చిన్న దు కాణదారులు నిరాకరించే అవకాశం ఉంది. డిజిటల్ ఇండియాను ప్రో త్సహించిన ప్రభు త్వం, ఇప్పుడు డిజిటల్ లా వాదేవీలపై భా రం మోపడం సరికాదని, ఈ నిర్ణయాన్ని తక్షణమే సమీక్షించాలని ప్రజలు మరియు వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.