ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

17-09-2026 | 07:47pm

భీమిని, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) భీమినీ మండలం చెన్నాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి కోసం మహిళలు గురు వారం ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల నుంచి నీటి సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈ సందర్భంగా మహిళలు తమ గోడు వెల్లబోసుకున్నారు.

గత కొన్ని రోజులుగా కాలనీకి మంచినీరు సరఫరాలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి నీళ్లు రాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. కాలనీలో ఉన్న 25 కుటుంబాలకే నీళ్లు అందించకపోతే, మండలంలోని అన్ని గ్రామాలకు నీరు ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లామని, అయినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి చెన్నాపూర్ లోని ఎస్సీ కాలనీకి నీటిని సరఫరా చేయాలని, లేనట్లయితే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు