కోరం లేకుండానే కొత్త సభ్యుల ఎంపిక.?

26-09-2026 | 05:04pm

ఐకేపీ ఏపిఏం, సిసి ఏకపక్ష నిర్ణయంపై న్యాయం కోరిన మహిళా సంఘాలు

జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మహిళా సంఘాల ఆవేదన

తుంగతుర్తి (విజయ క్రాంతి): తుంగతుర్తి(Tungaturthi) మండలం గానుగుబండ గ్రామంలో మొత్తం సంఘ బంధాల సంఖ్య 37. గ్రామ సంఘంలో గ్రామ సంఘం బంధం 11/03/26 నా ఎంపిక చేసి ఉన్నాము. వారి యొక్క కాలపరిమితి 6 నెలలు మాత్రమే పూర్తి అయినయి .కానీ ఏపీఎం, యాదమ్మ సీసీ,రమేష్ మా గ్రామ సంఘం మీటింగ్ ఏర్పాటు చేసి సాధారణ మీటింగ్ గా  అదే రోజు 11గంటలకు డబ్బు చాటింపు వేయించి, ప్రస్తుతం ఉన్న సంఘ బంధం సభ్యులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వారిని తొలగించి, 2/3 మెజార్టీ లేకుండా అక్కడికి వచ్చినటువంటి మహిళ సంఘాల కొద్దిమంది పేర్లను మాత్రమే రాసుకొని, కొత్త సభ్యులను ఎంపిక చేయడం జరిగింది.

అట్టి మీటింగ్లో హాజరైన మహిళలు సంఘాల లేని వారి పేర్లను కూడా రాసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. ఏపిఎం ను మీము అడగగా నా ఇష్టం, మెజార్టీ నాకు సంబంధం లేదు అని మాట్లాడడం జరిగిందని వారు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో కోరం లేనప్పటికీ, కొత్త సభ్యులు ఎంపిక చేయడం, విడ్డూరంగా ఉందని తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి, జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, అందరి సమక్షంలో కొత్త సభ్యులు ఎంపిక చేయాలని గానుగుబండ సంఘ బంధ మహిళా సంఘాలు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు