ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా
కోనరావుపేట ఆగష్టు 19 (విజయక్రాంతి): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం(World Photography Day Celebrations) సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంలో క్లిక్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండల అధ్యక్షులు సుదగోని సాయికుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జెండా ఎగురవేశారు. ప్రపంచ ఫోటోగ్రఫీకి మార్గదర్శకుడైన లూయిస్ డాగురె జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
అనంతరం ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుంకేటి అశోక్‌తో పాటు రమేష్, కిరణ్, శ్రీనివాస్, నవీన్, రాజు, రాజేష్, మదన్, అనిల్, ప్రశాంత్, శేఖర్, సత్యం, మహేష్ తదితర ఫోటో, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు. మహిళా ఫోటోగ్రాఫర్లు స్వప్న, శ్రావణి కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.“ఫోటోగ్రఫీ కేవలం చిత్రం కాదు… చరిత్రను భద్రపరిచే జ్ఞాపకం” అని ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు పేర్కొన్నారు.






