బైక్ ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమం

27-09-2026 | 10:57pm

యశోద ఆసుపత్రిలో చికిత్స.. ఆర్థిక సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు

బోధన్, సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి): బైక్‌ను డీసీఎం వ్యాను ఢీకొన్న(DCM van hits bike) ఘటనలో బోధన్ మండలం(Bodhan Mandal) ఊటుపల్లి గ్రామానికి చెందిన మంగలి కిరణ్ కుమార్(Mangali Kiran Kumar) (26) తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. కడుపు భాగంలో బలమైన గాయం కావడంతో అంతర్గత అవయవాలు దెబ్బతిని తీవ్ర రక్తస్రావం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో(Yashoda Hospital) వైద్యులు అత్యవసర చికిత్స(Doctors emergency treatment) అందిస్తున్నారు.

కిరణ్ కుమార్ మంగలి మల్లేష్, గంగమని దంపతుల ఏకైక కుమారుడు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరు సుమారు 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కిరణ్ కుమార్ తొమ్మిదో తరగతి వరకు చదువుకుని కుటుంబానికి అండగా నిలిచేందుకు తన కులవృత్తిని కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

రోజువారీ పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తుండగా శేరిలింగంపల్లి ప్రాంతంలో ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాను బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంలో కడుపు భాగంలో తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కుమారుడి ప్రాణాలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు తమ వద్ద ఉన్న డబ్బంతా ఇప్పటికే వైద్య ఖర్చులకు వెచ్చించారు. ప్రస్తుతం ఆసుపత్రి ఖర్చులు పెరుగుతుండటంతో మరింత ఆర్థిక సహాయం అవసరమవుతోంది. చేతిలో డబ్బులు లేకపోవడంతో తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందించేందుకు దాతల సహాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది.

దాతలు మానవతా దృక్పథంతో తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించి కిరణ్ కుమార్ ప్రాణాలను కాపాడేందుకు అండగా నిలవాలని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమై వేడుకుంటున్నారు.

సహాయం చేయదలచిన వారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్:

మంగలి మల్లేష్, ఊటుపల్లి, పెద్ద అల్లుడు ప్రకాష్ ఫోన్ నెంబర్ :+919573527333, 81061 19355 ఫోన్ పే  కలదు.

మరిన్ని వార్తలు