19 August, 2026 | 10:22 AM

ప్రమాదవశత్తు బావిలో పడి యువకుడు మృతి

19-08-2026 09:31 AM

బెజ్జూర్,(విజయ క్రాంతి): బహిర్భూమి కని వెళ్లిబావిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన బెజ్జూరు మండలంలో సోమవారం రాత్రి జరిగింది. బెజ్జూర్ ఎస్సై సర్తాజ్ పాషా తెలిపిన వివరాల ప్రకారం, బెజ్జూర్ మండలంలోని ఎలకపల్లి (బి) గ్రామానికి చెందిన కోట్రంగి నారాయణ 26 సంవత్సరాల యువకుడు వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు నారాయణ గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. కొట్రంగినారాయణ సోమవారం సాయంత్రం బహిర్భూమికి అని ఇంటి నుండి బయలుదేరి వెళ్లి  ఎలుక పెళ్లి సమీపంలోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు మృతుని తండ్రి తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామ నిర్వహించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.