ఘనంగా 'యువ టూరిజం క్లబ్' పోటీలు

21-09-2026 | 06:54pm

నంగునూరు, (విజయక్రాంతి):పాఠశాల విద్యాశాఖ,పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నంగునూరు ఉన్నత పాఠశాలలో(Nangunuru High School) సోమవారం మండల స్థాయి 'యువ టూరిజం క్లబ్'(Yuva Tourism Club) పోటీలు నిర్వహించారు.7వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం నిర్వహించిన ఈ వేడుకలో నాటకాలు,డాన్సులు,ఉపన్యాసాలు, పోస్టర్ తయారీ, పర్యాటక ప్రజెంటేషన్లపై పోటీలు జరిగాయి. దేశ సంస్కృతిని చాటేలా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ నెల 19న పాఠశాల స్థాయిలో గెలుపొందిన వారు ఈ మండల స్థాయి పోటీల్లో పాల్గొనగా.. వీరు ఈనెల 23న జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికవుతారని ఎంఈవో తగిరెడ్డి దేశీరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, హెచ్‌ఎం రామస్వామి గౌడ్,ప్రిన్సిపల్ శివకోటి,సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు,వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు