భగత్ సింగ్ జయంతి వేడుకలు

25-09-2026 | 03:59pm

నిర్మల్ సెప్టెంబర్ 25 ( విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్(Freedom fighter Bhagat Singh) 119వ జయంతి వేడుకలను శుక్రవారం ప్రగతిశీల మహిళా సంఘం(Progressive Women's Association) (పీఓడబ్ల్యూ), ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ పోషించిన పాత్రను కొనియాడారు.

చిన్న వయస్సులోనే దేశ ప్రజల స్వేచ్ఛ(Liberty), సమానత్వం, సామాజిక న్యాయం(social justice) కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. భగత్ సింగ్ కేవలం ఒక స్వాతంత్ర్య సమరయోధుడిగా మాత్రమే కాకుండా, సమాజంలోని అసమానతలు, దోపిడీ, అన్యాయాలపై ఆలోచించిన యువ విప్లవకారుడిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న, లక్ష్మి, గంగామణి, విజయ, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు