చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Government Degree College) నిర్మల్లోని చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ‘పోటీ పరీక్షలలో చరిత్ర(history) ప్రాధాన్యత’ అనే అంశంపై విస్తృతోపన్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకులు డాక్టర్ కటకం మురళి ముఖ్య వ్యక్తిగా హాజరై ప్రసంగిస్తూ, పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి చరిత్ర అధ్యయనం ఎంతో కీలకమని, ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమం చరిత్ర విభాగాధిపతి డాక్టర్ తోకల శ్రీనివాస్, డాక్టర్ పి జి రెడ్డిల ఆధ్వర్యంలో జరగగా, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం విస్తృతోపన్యాసం చేసిన డాక్టర్ K. మురళిని చరిత్ర విభాగం తరఫున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ యు. గంగాధర్, అధ్యాపకులు K. రమేష్ రెడ్డి, G. సుభాష్, కుంటా శ్రీహరి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.