గోదావరి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న రాళ్ల తొలగింపు
ఖానాపూర్( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మేడమ్ పల్లి గ్రామపంచాయతీ(Medampalli Gram Panchayat) పరిధిలో ఉన్న గోదావరి నది ప్రవాహానికి అడ్డుగా ఉన్న రాళ్లు ఆ గ్రామ ప్రజలు తొలగించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma Bojju Patel) ఆదేశాల మేరకు ఆ గ్రామ సర్పంచ్ గుగులావత్ రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు గోదావరి నదిలో రాళ్లను తొలగించి ప్రవాహానికి అడ్డంకులు తొలగించారు.
రాళ్లు అడ్డుగా ఉండడం వల్ల ఎస్సారెస్పీ నుంచి వస్తున్న గోదావరి నీటి ప్రవాహానికి అడ్డు తగిలి సదర్ మాట్ కాల్వకు నీళ్లు రాక రైతులకు నీరందడం లేదని గ్రహించిన రైతులు సర్పంచ్ లతో కలిసి ఈ రాళ్లను తొలగించినట్లు సర్పంచ్ తెలిపారు.