గణేష్ ఉత్సవాలు భక్తి వాతావరణంలో జరపాలి

11-09-2026 | 03:58pm

నిర్మల్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ఈనెల 14 నుంచి నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలు(Ganesh Navaratri Celebrations) భక్తి వాతావరణం లో జరుపుకోవాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు శుక్రవారం నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలోని మున్నూరుకాపు సంఘం భవనంలో లంగ్డాపూర్, తల్వేద, వెంగ్వాపేట్ గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గణేష్ మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగానికి అనుమతి లేదని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా డీజే ఏర్పాటు చేస్తే కేసులు నమోదు  చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై లింబాద్రి, ఆయా గ్రామాల సర్పంచులు, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు