ప్రజావాణి ఫిర్యాదు లపై తక్షణ స్పందన
నిర్మల్ ,నవంబర్ 2 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో(Police Office) సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు.వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, చట్టపరంగా పరిశీలించి బాధితులకు సకాలంలో న్యాయం అందించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయకుండా బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేస్తూ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.