టియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో 'డిమాండ్స్ డే'
02-10-2026 | 07:54pm
నిర్మల్ అక్టోబర్ 2: నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో అధ్యక్షులు కొండూరి రవిందర్, ప్రధాన కార్యదర్శి భూమయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుండి గాంధీ పార్క్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీ పార్క్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. మహాత్ముని విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. డిమాండ్స్ డే నిరసన చేపట్టి, ఆర్డీవో దేవిదాస్(RDO Devidas) ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్ పరిష్కారం చేసేవరకు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీనికి రాజకీయ పార్టీల నాయకులు మద్దతు పలికారు.