సీజనల్ వ్యాధులపై సర్వే

25-09-2026 | 04:02pm

నిర్మల్ సెప్టెంబర్ 25 ( విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లాలో సీజనల్ వ్యాధులు(Seasonal diseases) వ్యాప్తి చెందకుండా జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్(District Medical Officer Dr Rajender) తెలిపారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామం(Kadthal Village)లో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ(Department of Medical and Health) సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే(fever survey) నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించారు.

అవసరమైన మందులు అందజేశారు. చికిత్స అవసరమైన వారిని ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)కి వెళ్లాలని సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సాయినాథ్, ఆశా వర్కర్లు సరోజ, సుజాత, రాధా, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు