ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత ప్రచారం

19-10-2026 | 06:26pm

నిర్మల్ అక్టోబర్ 19 (విజయక్రాంతి): జిల్లా లీడ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ సాచురేషన్‌ క్యాంపెయిన్‌’కు సంబంధించిన గోడ ప్రతులను జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా(Collector Bhavesh Mishra) సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 21వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్‌ సేవలు, ఆర్థిక పథకాలపై అవగాహన కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్‌ సేవలు ప్రజలకు చేరేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాథోడ్‌ రమేష్‌, వెంకట మాధవరావు, జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రాంగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు