ఫ్యూచర్ సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం
శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి
ఇబ్రహీంపట్నం: తెలంగాణలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్(Future City Police Commissionerate) అందుబాటులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కమిషనరేట్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. అనంతరం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషీ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషీతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.