రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన వెల్ది మోడల్ స్కూల్ విద్యార్థిని
రఘునాథపల్లి, అక్టోబర్ 29 (విజయక్రాంతి): గత నెల 23న జనగామ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో(Telangana Social Welfare Gurukul School) నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి 14 ఏళ్ల లోపు బాల బాలికల ఫుట్ బాల్ క్రీడోత్సవాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన వెల్ది తెలంగాణ మోడల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థిని ఎడ్ల రితికను పాఠశాల యాజమాన్యం అభినందించింది.
అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలోని సన్ ఫ్లవర్స్ వేదిక్ స్కూల్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి 14 ఏళ్ల లోపు ఫుట్ బాల్ పోటీల్లో రితిక పాల్గొంటోంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పాలకుర్తి శ్రీధర్, వ్యాయామ ఉపాధ్యాయులు మారపాక రాజయ్య, బైరి వెనీల్ కుమార్, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.