బాసర గోదావరి తీరానికి భారీగా తరలివస్తున్న దుర్గమ్మ విగ్రహాలు

22-10-2026 | 08:03pm

నిమజ్జనానికి పోటెత్తిన భక్తులు.. పుష్కర ఘాట్‌ వద్ద సందడి

బోధన్,(విజయక్రాంతి): నవరాత్రి ఉత్సవాల(Navaratri celebrations) ముగింపు సందర్భంగా దుర్గమ్మ విగ్రహాల నిమజ్జనానికి(Durga idol immersion) బాసర గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడుతోంది. నిజామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో దుర్గమ్మ విగ్రహాలను భక్తులు బాసర గోదావరి బ్రిడ్జి సమీపంలోని పుష్కర ఘాట్‌(Pushkar Ghat) వద్దకు తరలిస్తున్నారు. అమ్మవారి నిమజ్జనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గోదావరి తీరం సందడిగా మారింది.

మహిళలు మంగళహారతులు ఇచ్చి, భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు వీడ్కోలు పలుకుతున్నారు. అమ్మవారి నామస్మరణలు, భక్తుల సందడి మధ్య నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న దుర్గమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు