ఆమె పోరాటం ఎనలేనిది

10-09-2026 | 01:26pm

ఆమె ధైర్యం ముందు దొరలు కూడా పారిపోయారు

ఎల్లారెడ్డిలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి 

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 10(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణం లో మండల రజక సంఘం ఆధ్వర్యంలో,గురువారం తెలంగాణ సాయుధపోరాట యోధురాలు ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ  తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో ఒక గొప్ప మహిళా యోధురాలు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమె, అన్యాయం మరియు అణచివేతకు తలవంచకుండా తన హక్కుల కోసం ధైర్యంగా పోరాడారు.

భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆమె చూపిన పోరాట పటిమ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.  అన్యాయాన్ని ఎదిరించి, ఎంతటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా నిలబడటం ఆమె ధైర్యానికి నిదర్శనం. ఐలమ్మ  పోరాటం కేవలం ఒక వ్యక్తి కోసం జరిగిన పోరాటం కాదు,అది ఆత్మగౌరవం కోసం, రైతుల హక్కుల కోసం, మహిళల గౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటం అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు అయ్యన్న సాయి ప్రసాద్,మరియు పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ మత్తమాల ప్రశాంత్ గౌడ్ ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు,ఎల్లారెడ్డి రజక సంఘం ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు