శ్రీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 9 ఎకరాల గడ్డివాము దగ్ధం

01-11-2026 | 04:43pm

బోధన్, నవంబర్ 01 (విజయక్రాంతి): వర్ని మండలం శ్రీనగర్ గ్రామ శివారులో ఆదివారం భారీ అగ్నిప్రమాదం(Massive Fire) చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గడ్డివాముకు మంటలు అంటుకోవడంతో సుమారు 9 ఎకరాల విస్తీర్ణంలో నిల్వ ఉంచిన పశుగ్రాసం పూర్తిగా దగ్ధమైంది.

గ్రామానికి చెందిన లేళ్ల బోస్‌కు సంబంధించిన గడ్డివాము ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో గడ్డివాము మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే ఈ అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనే విషయం ఇంకా తెలియరాలేదు. స్థానిక పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. పశుగ్రాసం పూర్తిగా కాలిపోవడంతో బాధిత రైతుకు భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి బాధితుడిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు