ప్రశాంతంగా ముగిసిన NMMS పరీక్ష.. 2,017 మంది విద్యార్థుల హాజరు
బోధన్, నవంబర్ 01 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా(Nizamabad District)లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(NMMS) పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 10 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి(DEO) సాయాగౌడ్ తెలిపారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పరీక్షా కేంద్రాల్లో మొత్తం 2,116 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 2,017 మంది విద్యార్థులు హాజరయ్యారని వెల్లడించారు. మరో 99 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష పూర్తయినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.