బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్
ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలం(Muttharam Mandal) మచ్చుపేట గ్రామానికి చెందిన బంధారపు మల్లయ్య అలియాస్ చంద్రన్న, రాజు తల్లి బంధారపు లక్ష్మి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్(Block Congress President Tirupati Yadav) శుక్రవారం బాధిత కుటుంబాన్ని(victim family) పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎల్లే రామ్మూర్తి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రొడ్డ బాపన్న, మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమరయ్య గౌడ్, ఐఎన్‌టీయూసీ నాయకుడు శంకేసి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.