గణేష్ నవరాత్రులు భక్తిశ్రద్ధలతో జరపండి: ఏసీపీ వసుంధర యాదవ్
సత్తుపల్లి సెప్టెంబర్11( విజయ క్రాంతి): గణేష్ నవరాత్రులు(Ganesh Navratri) భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, కల్లూరు ఏసిపి వసుంధర యాదవ్ ఐ.పి.ఎస్ అన్నారు. శుక్రవారం గణేష్ నవరాత్రులు సందర్భంగా ఏ.సి.పి కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణేష్ మండపాలు నిర్వహించేవాళ్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తిశ్రద్ధలతో ,సోదర భావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, భద్రత నియమాలు పాటించాలని, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మండపాలు నిర్వహించేవారు పోలీస్ శాఖ పోర్టల్ policeportal.tspolice.gov.in వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని కోరినారు.
విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు, ఊరేగింపులు, నిమజ్జనం, తదితర కార్యక్రమాలను ముందస్తు ప్రణాళికతో నిర్వహించే అవకాశం ఉంటుందని అన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,విద్యుత్ కనెక్షన్లు వైరింగ్ నిపుణులతో తనిఖీ చేయించాలని వారికి సూచించారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా అవసరమైన అగ్ని మాపక పరికరాలను అందుబాటులో ఉంచాలని, మండపాల వద్ద అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు మార్గాలను ఎట్టి పరిస్థితులను మూసి వేయకూడదని స్పష్టం చేశారు. మండపాల వద్ద భక్తులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున రద్దీ నియంత్రణ, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లు చేసుకోవాలని, డీజేలు సౌండ్ సిస్టం వినియోగంలో ప్రభుత్వ నిబంధనలో తప్పనిసరిగా పాటించాలని, అధిక శబ్దాలతో ప్రజలను ఇబ్బంది కలిగించవద్దని నిర్వాహకులకు సూచించారు.
రాత్రి వేళలో శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలు నిర్వహించకుండా,నిబంధనల పాటించాలని,విగ్రహాల ఊరేగింపు నిమజ్జనా కార్యక్రమం ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులతో సమన్వయంగా చేసుకోవాలని సూచించారు. ఊరేగింపులో పాల్గొనేవారు క్రమశిక్షణతో ఉండాలన్నారు. నిమజ్జన సమయంలో నీటిలోకి తొందరపడి వెళ్ళవద్దని, అత్యవసర సమయాల్లో 100 కి కాల్ చేయాలని, పోలీస్ సహకారాలు తీసుకోవాలని సూచించారు. మండపాలు నిర్వహించేవారు వారి ఫోన్ నెంబర్లు,రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేపించాలని, మండపాలు పెట్టే ప్రదేశాలు సంబంధిత వ్యక్తుల నుండి అభ్యంతర లేదని ధ్రువీకరణ పత్రం, వివాద స్థలాలలో విగ్రహాలు ప్రతిష్టించవద్దని, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీగా ఉండే రహదారులపై విగ్రహాలు ఏర్పాటు చేయవద్దని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ నివారించేందుకు నాణ్యమైన విద్యుత్ తీగలను పరికరాలను ఉపయోగించాలని, మండపాల వద్ద డిజె లకు అనుమతి లేనందున, రెండు మైక్ తో కూడిన స్పీకర్లు మాత్రమే అనుమతించబడతాయి.
అదేవిధంగా ఉదయం 06:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు సమయాలను అనుసరించి మైక్ సౌండ్ సిస్టం వినియోగించుకోవాలని వివరించారు. మండపాలలో అసభ్యకరమైన నృత్యాలు, కార్యక్రమాలు నిర్వహించవద్దని, కనీసం ఇద్దర సభ్యులు 24 గంటలు మండపాల్లో ఉండేవిధంగా చూడాలని, నోటీసు బోర్డును పాయింట్ బుక్ ఏర్పాటుచేసి, తప్పనిసరిగా నిర్వాహకుల సంప్రదింపు నెంబర్లు వివరాలు పొందుపరచాలని, అగ్ని ప్రమాదాలను నివారించడానికి ప్రతి మండపం దగ్గర తప్పనిసరిగా ఫైర్ ప్రూఫ్ ఉండేలా చూసుకోవాలని నిర్వాహకులకు తెలిపారు. అనంతరం ఫైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి సిఐ తుమ్మలపల్లి శ్రీహరి,ఎస్ ఐ లు కవిత, అశోక్ ,ప్రదీప్ ,పోలీస్ సిబ్బంది ఉన్నారు.