గంగమ్మ ఒడికి చేరుకున్న బొజ్జ గణపయ్య...
23-09-2026 | 10:14pm
గణపతి బాప్ప మోరియా అంటూ నినాదాలు..
సుల్తానాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli district) సుల్తానాబాద్ పట్టణంలో గత తొమ్మిది రోజులుగా మన ఇంట్లో, మన వీధిలో, మన మనసులో కొలువై ఉండి నిత్య ధూప దీప నైవేద్యాలు అందుకున్న బొజ్జ గణపయ్య బుధవారం రాత్రి గంగమ్మ ఓడికి చేరుకున్నారు. పట్టణం అంతట ఆధ్యాత్మిక శోభను నింపిన ఆ వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.
యువకులు, పిల్లలు, గణపతి బప్పా మోరియా మంగళ మూర్తి మోరియా అంటూ పిల్లలు, యువకుల నినాదాలతో ఆ గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చారు... వర్షం కారణంగా కొత్త ఇబ్బందులు ఏర్పడ్డాయి, పట్టణంలోని పెద్ద చెరువు వద్ద మున్సిపల్ శాఖ వారు, పోలీసు శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేశారు.