బోగిరి రాయమల్లు మృతికి అయిలి ప్రసాద్ సంతాపం

02-11-2026 | 03:38pm

నిత్యకర్మ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు పరామర్శ

మంథని,(విజయక్రాంతి): మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ బోగిరి రాయమల్లు నిత్యకర్మ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. మంథని కానిస్టేబుల్ దుబ్బాస రమేష్ మామ అయిన బోగిరి రాయమల్లు చిత్రపటానికి పూలమాల వేసి ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కేపల్లి సర్పంచ్ పేయ్యల సంధ్యారాణి, సురేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు