వ్యాధుల నివారణ కోసం అవగాహన..
06-11-2026 | 06:42pm
సుల్తానాబాద్, నవంబర్ 06 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోనీ ఏడవ వార్డులో కౌన్సిలర్ ఉట్ల వరప్రదీప్(Councilor Varapradeep) శుక్రవారం కాలనీలో పర్యటించి ప్రజలకు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు, మున్సిపల్ కార్మికులతో కాల్వలను శుభ్రం చేయించారు. దోమల నివారణకు డ్రంబుల్లో నీళ్లు నిలువ ఉంచకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. గృహవాసులు తప్పనిసరిగా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని వర ప్రదీప్ కాలనీ వాసులకు తెలిపారు.