కరెన్సీ గణనాథుడు..రూ.9లక్షతో అలంకరణ

19-09-2026 | 12:27pm

సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్‎లో భక్తులను ఆకట్టుకున్న గణనాథుడు

సుల్తానాబాద్,సెప్టెంబర్ 19(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్(Sultanabad) పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం(Arya Vysya) ఆధ్వర్యం లో ఆర్యవైశ్య భవన్ లో  ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి వారికి రూ.9,99,999 రూపాయల కరెన్సీ మాలలతో  అలంకరించారు, ఇందులో రూ. 20, రూ.50, రూ.100, రూ. 500 నోట్లతో గణనాధుని అందంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని కరెన్సీ అలంకరణలో ఉన్న గణేష్ ని ఆసక్తిగా తిలకించారు..

పూజా కార్యక్రమంలో చకిలం మారుతిలత, చిట్టి మల్ల వినయ్ వర్షిత దంపతులచే అర్చకులు పారువెల్ల అభిషేక్ శర్మ పూజలు చేయించారు... ఈ కార్యక్రమంలో పట్టణ  ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కొమురవెల్లి రామ్మూర్తి, అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, సెక్రటరీ తోడుపునూరి రాజేంద్రప్రసాద్, క్యాషియర్ కొమురవెల్లి (కేబి) శ్రీనివాస్, పట్టణ మహిళా అధ్యక్షురాలు బాదం వాణి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు