నిమజ్జనానికి నీళ్లు లేక భక్తుల అవస్థలు
గోదావరి ఎండిపోవడంతో భక్తుల్లో ఆందోళన
గోదావరి నదిలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): వినాయక నిమజ్జనోత్సవాలు జరుగుతున్న వేళ గోదావరి నదిలో నీళ్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు కోరుకంటి చందర్(Former MLA Korukanti Chander) అన్నారు. గోదావరి నది బ్రిడ్జి వద్ద మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు గోదావరిలో సరిపడా నీరు లేకపోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, ఉత్సవ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పండుగ సమయంలో ఈ పరిస్థితి రావడం బాధాకరమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గోదావరి ఎండిపోయిందని చందర్ విమర్శించారు. నిమజ్జనోత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీటిని వెంటనే గోదావరిలోకి విడుదల చేయాలని, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.