కరెంటు కోతలు లేకుండా చూడాలి..

13-10-2026 | 07:42pm

విద్యుత్ వినియోగదారుల పరిష్కార సమావేశంలో రైతన్నలు...

సుల్తానాబాద్, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల సబ్ స్టేషన్ లో సుల్తానాబాద్ సబ్ డివిజన్(Sultanabad Sub-division), పెద్దపల్లి సబ్ డివిజన్, పెద్దపల్లి సర్కిల్ విద్యుత్ వినియోగదారుల పరిష్కార సమావేశం మంగళవారం  నిర్వహించారు.. ఈ సమావేశంలో వినియోగదారుల   పరిష్కార వేదిక ఛైర్మెన్ మాధవరావు(Grievance Redressal Forum Chairman Madhava Rao) పాల్గొన్నారు.. 

వినియోగదారులు పలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకు రాగా  అధికారులు సమాధానం ఇచ్చారు.. తమకు నాణ్యమైన విద్యుత్తు అందించాలని పలుమార్లు ప్రజా ప్రతినిధుల  ద్వారా అధికారుల  దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ స్పందించడం లేదని అన్నారు,

ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాణ్యమైన విద్యుత్తు అందించడంతోపాటు కరెంటు కోతల సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రైతన్నలు వేడుకున్నారు.... ఈ కార్యక్రమంలో డిఈ రాజా బ్రహ్మచారి, ఏడిఈ రామస్వామి , ఏఈ కిషోర్ , ఎజిగేడు ఏఈ సంపత్ , ఫర్ మ్యాన్ శంకరయ్య, ఎస్ఎల్ఐ గ్యాంగ నాయక్, లైన్ ఇన్స్పెక్టర్ లు సుధాకర్, రమేష్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు