రాజ్యాంగ గొప్పతనాన్ని విద్యార్థులు తెలుసుకోవాలి

26-11-2026 | 09:40pm

వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానంలో విద్యార్థి నాయకుడు డిగంబర్

మంథని, నవంబర్ 26(విజయ క్రాంతి): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day of India) పురస్కరించుకొని మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి నాయకుడు బెజ్జంకి డిగంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు గురువారం బహుమతులు ప్రదానం చేశారు.

భారత రాజ్యాంగం – అంబేద్కర్ పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో ప్రథమ బహుమతిని ఐశ్వర్య, ద్వితీయ బహుమతిని మేఘన, తృతీయ బహుమతిని ఆంజనేయ ప్రసాద్ సాధించారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు బెజ్జంకి డిగంబర్, వక్తలు బూడిద తిరుపతి, విరుగురాళ్ల ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగాల్లో ఒకటని కొనియాడారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎంతో కృషి చేసి దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువల వల్లే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు.

విద్యార్థులు రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకొని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలుర కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జ్యోతి, అధ్యాపకులు శ్రీనివాస్, రాజ్‌కుమార్, రాఘవేంద్రచారి, మనోహర్‌తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు