ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి
పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్
సుల్తానాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ఎల్‌నినో ఎదురుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని, సాగు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్(Chairman Anthati Annayya Goud) అన్నారు, ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో 80 దేశాలలో ఎలినినో ప్రభావం తీవ్రంగా ఉందన్నారు.
రానున్న 9 నెలలు ప్రజలంతా నీరు, కరెంట్ పొదుపుగా వాడుకోవాలి అన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని ముందు నుండే చెప్తున్నారని , ఎల్ నినో పై బిఆర్ఎస్ , బిజెపి విమర్శలు చేయడం సరైనది కాదన్నారు, రాజకీయాలకతీతంగా అందరూ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పారు.జిల్లా రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఎస్సారెస్పీ నుండి నీటిని విడుదల చేయించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు ల కు అన్నయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.