గీత మందిర్ ఆలయానికి పవర్ ఇన్వర్టర్ అందించిన జన చైతన్య సేవా సమితి
ఘట్ కేసర్, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలోని(Ghatkesar town) గీత మందిర్(Geeta Mandir) ఆలయానికి జన చైతన్య సేవా సమితి(Jana Chaitanya Seva Samithi) ఆధ్వర్యంలో పవర్ ఇన్వర్టర్‌ను అందజేశారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ ఆధ్వర్యంలో సమితి సభ్యుడు అబ్బసాని ప్రవీణ్ యాదవ్(Abbasani Praveen Yadav) చేతుల మీదుగా ఆలయ కమిటీకి ఇన్వర్టర్‌ను అందించారు.
రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఆలయంలో లైట్లు వెలిగేందుకు, ఆలయ పరిసరాల్లో భద్రతను మెరుగుపరిచేందుకు నిరంతర విద్యుత్ సరఫరా అవసరమని ఆలయ కమిటీ కోరడంతో ఈ ఇన్వర్టర్‌ను అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
జన చైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు, ఆలయాలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, భవిష్యత్తులోనూ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని సమితి ప్రతినిధులు తెలిపారు.
ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బేతాళ నర్సింగ్ రావు, జన చైతన్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి సార శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డు సభ్యుడు మడిపడిగే ఆంజనేయులు, ఆలయ ప్రధాన అర్చకులు కిషోర్, వెంకట్ రెడ్డి, సత్తి రెడ్డి, రాజబోయిన రాంచందర్ యాదవ్, జన చైత్యన సేవా సమితి ఆర్గనైజర్ సెక్రటరీ శివరాత్రి సురేష్, లక్ష్మీనారాయణ, సాయిరాం, తనీర్ హరీష్, మోహన్, పవన్, తరుణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.