ఉచిత కుట్టు మిషన్ శిక్షణతో మహిళలకు స్వయం ఉపాధి

22-09-2026 | 08:13pm

శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ

ముత్తారం,సెప్టెంబర్ 22(విజయ క్రాంతి) మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని గ్రామ సర్పంచ్ చిలివేరి జ్యోతి లక్ష్మణ్(Sarpanch Chiliveri Jyoti Laxman), జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక సభ్యుడు తాళ్లపల్లి కుమార్ స్వామి అన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మచ్చుపేట గ్రామంలో నిర్వహించిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణను పూర్తి చేసుకున్న మహిళలకు మంగళవారం  సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా తమకు ఉన్న నైపుణ్యంతో స్వయం ఉపాధి పొందాలని సూచించారు. కుట్టు మిషన్ శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుని ఇంటి వద్దనే ఉపాధి పొందుతూ కుటుంబ ఆర్థిక పరిస్థితికి చేయూత అందించాలని ఆకాంక్షించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బంధారపు సాగర్, కళావేణ దేవరాజ్, పంచాయతీ కార్యదర్శి దిలీప్, ఏపీఎం స్వరూపరాణి, శిక్షణ ఉపాధ్యాయురాలు ఆకుల స్రవంతి, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల సలహాదారు రజిత, ఐకేపీ సీసీ ఎల్లమ్మ, సీఏ కోమలత, కాంగ్రెస్ కార్యకర్తలు, శిక్షణ పొందిన మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు