సుల్తానాబాద్ ఎస్జిఎఫ్ జోనల్ లెవెల్ అథ్లెటిక్స్‌లో 28 పతకాలు సాధించిన విద్యార్థులు

21-09-2026 | 06:02pm

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ ప్రభుత్వ  జూనియర్ కళాశాలలో ఈనెల 19న  నిర్వహించిన సుల్తానాబాద్ జోనల్ లెవెల్ అథ్లెటిక్స్(Sultanabad SGF Zonal Level Athletics Goals Stadium)లో కేరళ మోడల్ హై స్కూల్(Kerala Model High School) విద్యార్థులు. అండర్ –17  బాలబాలికల విభాగంలో వి.అశ్వద్ రజతం, కాంస్య పతకం, టి. సాయివిష్ణు రెండు కాంస్య పతకాలు, ఎన్. సందేష్ రజతం ఆర్. అన్వేష్ కాంస్యం, కె. యశ్వంత్ కాంస్యం, రిషివర్ధన్ బంగారు పతకం,ఎ వైశాలి , బంగారు, రెండు రజతాలు, ఒకటి కాంస్యం, ఎ. గాయత్రి ఒకటి, బంగారు, కాంస్యం, కె. శ్రీజ రజతం, బి. ఐశ్వర్య రజతం, ఆఫ్రిన్ రజతం, సుమన్ బంజారా కాంస్యం, అండర్ –14  బాలబాలికల విభాగంలో  కె. శ్రీచరణ్ మూడు బంగారు పతకాలు, జి. చరిత రెండు బంగారు పతకాలు, ఒక రజత పతకం, కె వినూత్న బంగారు పతకం, వి. అవంతిక కాంస్య పతకాలు గెలుచుకున్నారు.  వీరు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో జరిగే అథ్లెటిక్స్ పోటీలకు అర్హత సాధించారని సుల్తానాబాద్ జోనల్  కన్వీనర్ డి. రమేష్ , మండల కన్వీనర్ టి. ప్రణయ్తెలిపారు, ఈ సందర్భంగా సోమవారం కేరళ మోడల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సిజ్జు ఎస్ నాయర్  , వైస్ ప్రిన్సిపాల్  స్మిత ఎస్నాయర్, మరియు పీటీలు ఎ. అజయ్, డి. రాజు, ఉపాధ్యాయులు అభినందించారు.

మరిన్ని వార్తలు