ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానం
ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) ముస్తాబాద్ మండల స్థాయి ప్రభుత్వ ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి అంబటి రవీందర్(Mandal Education Officer Ambati Ravinder) ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అభివృద్ధి అధికారి లచ్చాలు,మండల రెవిన్యూ అధికారి ఫారూక్ హాజరై ప్రసంగించారు.మనం చేసే ఉద్యోగం ఏదైనా నిబద్దతతో నిజాయితీగా పని చేస్తే గుర్తింపు అదే వస్తుందన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని అభినందించారు. ఈ అవార్డు మాకు మరింత బాధ్యతలు పెంచిందని నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించి విద్యా వ్యవస్థను మంచి ఫలితాలతో మరింత ముందుకు తీసుకెళ్తామని అవార్డు గ్రహీతలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నిమ్మ రాజిరెడ్డి ,రాజేశ్వరి,భూపతి ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంజ గౌడ్, బాలకిషన్,ఎల్లారెడ్డి ఉపాధ్యాయులు ఎంఆర్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.