తాపస్ పల్లి రిజర్వాయర్ నీటిని తాగునీటి కోసమే వినియోగిస్తాం

11-09-2026 | 11:04pm

 కలెక్టర్ హైమావతి హైమావతి 

 కొమురవెల్లి(విజయ క్రాంతి): ఎల్ నీనో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితుల కారణంగా తపస్ పల్లి రిజర్వాయర్(Tapaspally Reservoir) నీటిని తాగునీటి అవసరాల కోసమే వినియోగిస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి(Collector Haimavati Haimavati) ఉన్నారు. తపస్ పల్లి రిజర్వాయర్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే కుడి ఎడమ కాలువలోకి నీటిని పంపిణీ చేయడం లేదని తెలిపారు.

రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం  0.3 టీఎంసీలుగాను 0. 2 టీఎంసీల నీటిని రిజర్వాయర్ లో పంపు చేసి నిల్వ చేశామన్నారు. ఈ నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తామన్నారు. వ్యవసాయానికి వినియోగించే పరిస్థితులు లేవన్నారు. అనంతరం తపస్పల్లి రిజర్వాయర్ సంబంధించి కుడి ఎడమ కాల్వలను ఆయా గ్రామాలలో పరిశీలించారు. ఆమె వెంట నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు