నూతన ఎస్సైగా బాలరాజు బాధ్యతల స్వీకరణ

06-11-2026 | 06:14pm

గంభీరావుపేట, నవంబర్ 6 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district) గంభీరావుపేట పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా బాలరాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఆయన మెదక్ జిల్లా రామాయంపేట నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై బాలరాజు మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచుతానని తెలిపారు. నూతన ఎస్సైకి పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు