రాజన్న సిరిసిల్లలో బండి సంజయ్‌ పర్యటన

19-09-2026 | 12:20pm

వినాయక మండపాల సందర్శన 

సాయంత్రం 6 గంటలకు కార్గిల్‌ లేక్‌ నుంచి పర్యటన ప్రారంభం

రాజన్న సిరిసిల్ల 19 సెప్టెంబర్‌ (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బండి సంజయ్‌ కుమార్‌(Bandi Sanjay Kumar) శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వినాయక చవితి(Vinayaka Chavithi) ఉత్సవాలను పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని వివిధ వినాయక మండపాలను ఆయన సందర్శించనున్నారు.

ఈ సందర్భంగా వినాయక విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించనున్నారు. సాయంత్రం 6గంటలకు కార్గిల్‌ లేక్‌ నుంచి బండి సంజయ్‌ పర్యటన ప్రారంభం కానుంది.అనంతరం పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించే కార్యక్రమం కొనసాగనుంది.


మరిన్ని వార్తలు