తాతా మధు దిష్టిబొమ్మ దహనం

07-09-2026 | 11:23pm

కోనరావుపేట,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై(Speaker Gaddam Prasad Kumar) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు(MLC Thatha Madhu) అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం కోనరావుపేట మండల(Konaraopet Mandal) కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీగా ఉన్న తాతా మధు శాసనసభ సమావేశాల్లో నియమ నిబంధనలను పాటించకుండా స్పీకర్‌ను హేళన చేసేలా మాట్లాడటం సరికాదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాతా మధు వైఖరిని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. శాసనసభ స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాలని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు సభా సంప్రదాయాలను, నియమ నిబంధనలను పాటించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు షేక్ ఫిరోజ్ పాషా, రుక్మిణి, చంద్రగిరి వేణుగోపాల్, ఏఎంసీ, పీఏసీఎస్ డైరెక్టర్లు, స్థానిక సర్పంచ్ కాశిరాం, వివిధ గ్రామాల కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు